ముంబై: రోడ్డు కుంగిపోవడంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఒక కారు ఆ గుంతలో ఇరుక్కుపోయింది. (Car Trapped in Caved Road) ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం దాదర్ సమీపంలోని ప్రభాదేవి ప్రాంతంలోని రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయానికి సమీపంలో ఉన్న ఈ రోడ్డుపై పలు చోట్ల గోతులు ఏర్పడ్డాయి. పెద్ద గుంతలో ఒక కారు చిక్కుకుపోయింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గోతులు ఏర్పడిన ఆ రోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలిపారు. ప్రభాదేవి జంక్షన్ ప్రాంతంలోని రోడ్డుపై గుంతల కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
#WATCH | Mumbai: Car Gets Trapped As Portion Of Road Caves-In Near Siddhivinayak Temple In Prabhadevi#Mumbai #mumbainews pic.twitter.com/keLte5Sb16
— Free Press Journal (@fpjindia) September 12, 2024
A sinkhole has appeared right in the middle of the Prabhadevi Junction! 😱 ⚠️
Media and police already there.
@RoadsOfMumbai pic.twitter.com/IgJ9uwV5xW
— Karthik Nadar (@runkarthikrun) September 12, 2024