కొల్హాపూర్: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో దారుణం జరిగింది. ఓ కూడలి వద్ద కారు(Car Crash) బీభత్సం సృష్టించింది. హుందయ్ శాంట్రో కారు నడుపుతున్న 72 ఏళ్ల వ్యక్తి.. ఓ జంక్షన్ వద్ద వేగంగా దూసుకెళ్లాడు. దీంతో ఆ సమయంలో రోడ్డు మీద ఉన్న బైక్‌లను ఢీకొట్టేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. సైబర్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శాంటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు. సీసీటీవీకి ఈ దృశ్యాలు చిక్కాయి.
ఇవాళ మధ్యాహ్నం 2.25 నిమిషాల సమయంలో సైబర్ చౌక్ జంక్షన్ వద్ద కార్లు, ట్రక్కులు, బైక్‌లు రోడ్డు క్రాస్ చేస్తుండగా, సడెన్‌గా ఓ కారు వేగంగా దూసుకొచ్చేసింది. మూడు బైక్‌లను ఆ కారు ఢీకొట్టింది. ఓ బైక్‌పై ఉన్న ఇద్దరు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఓ బైక్‌పై ఉన్న మహిళ, చిన్నారి కిందపడిపోగా, ఆ బైక్‌ను నడుపుతున్న వ్యక్తి లేచి చిన్నారిని ఎత్తుకున్నాడు. మహిళ లేపే ప్రయత్నం చేశాడు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరు కూడా దూరంగా కిందపడిపోయాడు.
బైకర్లను ఢీకొట్టి పోల్ మీదకు దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.
Kolhapur car accident..!!#Kolhapur pic.twitter.com/lWyFMc8c8V
— Byomkesh Bakshi (@_saptsindhu) June 3, 2024