పాట్నా: హైవేపై వేగంగా దూసుకెళ్లిన కారు, వేగంగా వెళ్తున్న లారీని సైడ్ వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి ఆ కారు ఐదుసార్లు పల్టీలు కొట్టింది. (Car Flips 5 Times) అయితే అదృష్టవశాత్తు అందులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని రోహ్తాస్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం మారుతి సుజుకి ఆల్టో కారు హైవేపై వేగంగా దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న లారీని ఒక పక్కన ఢీకొన్నది. ప్రమాదం ధాటికి హైవేపై ఆ కారు ఐదుసార్లు పల్టీలు కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన బోల్తాపడింది.
కాగా, గమనించిన స్థానికులు పరుగున ఆ కారు వద్దకు వెళ్లారు. అయితే అందులో ప్రయాణించిన వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. స్వల్పంగా గాయపడిన వారికి స్థానికులు ప్రథమ చికిత్స అందించారు. కారులోని వ్యక్తులు బనారస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కారు ఢీకొట్టిన లారీ ఆగకుండానే వెళ్లిపోయింది. మరోవైపు కారు పల్టీలు కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bihar News : सासाराम में सड़क पर लुढ़कती चली गयी कार…हादसा सीसी टीवी में हुआ कैद#BiharNews pic.twitter.com/xIoiKkvis8
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) May 25, 2025