జైపూర్: రాంగ్ రూట్లో వచ్చిన కారు సీఎం కాన్వాయ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారుతోపాటు సీఎం కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురు గాయపడ్డారు. సీఎం వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. (Car Collides With CM’s Convoy) రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌తో కలిసి నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు సీఎం భజన్‌లాల్ శర్మ తన కాన్వాయ్‌లో బయలుదేరారు.
కాగా, అక్షయపాత్ర కూడలి వద్ద రాంగ్ సైడ్ నుంచి వచ్చిన ట్యాక్సీ కారు సీఎం కాన్వాయ్‌లోని తొలి రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఆకస్మిక ఘటనతో కాన్వాయ్‌లోని ఇతర వాహనాలకు బ్రేకులు వేయడంతో మరో వాహనం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులతోపాటు ట్యాక్సీ కారు డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు.
మరోవైపు ఈ సంఘటన జరిగిన వెంటనే సీఎం భజన్‌లాల్ శర్మ కారు నుంచి కిందకు దిగారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సురేంద్ర సింగ్ పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య అధికారి తెలిపారు. తలకు గాయమైన అతడు వెంటిలేటర్‌పై ఉన్నట్లు చెప్పారు. కాగా, సీఎం భజన్‌లాల్ శర్మ కాన్వాయ్ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Rajasthan CM Bhajanlal Sharma’s cavalcade met with an accident. A speeding Ertiga came in from the wrong side while the CM was enroute.
CM took the injured in his own car to the hospital. pic.twitter.com/Sq0Lk3tXv3
— Chetan Bhutani (@BhutaniChetan) December 11, 2024
Jaipur, Rajasthan: An accident occurr involving a vehicle in CM Bhajanlal Sharma’s convoy at NRI Circle pic.twitter.com/5e4A4FYYn4
— IANS (@ians_india) December 11, 2024