మంగళవారం 14 జూలై 2020
National - Jun 22, 2020 , 13:41:36

నూత‌న జంటతో వెళ్తున్న కారు.. న‌దిలోకి దూసుకెళ్లింది

నూత‌న జంటతో వెళ్తున్న కారు.. న‌దిలోకి దూసుకెళ్లింది

రాంచీ : నూత‌న వ‌ధూవ‌రుల‌తో వెళ్తున్న కారు అదుపుత‌ప్పి.. న‌దిలోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదం నుంచి వ‌ధూవ‌రుల‌తో పాటు మ‌రో ముగ్గురు వ్య‌క్తులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్ లోని ప‌లాము జిల్లాలోని మ‌ల‌యు న‌ది వ‌ద్ద చోటు చేసుకుంది. 

పెళ్లి ముగిసిన త‌ర్వాత వ‌రుడు.. త‌న భార్య‌తో క‌లిసి కారులో సొంత గ్రామానికి వెళ్తున్నారు. మ‌ల‌యు న‌ది వ‌ద్ద‌కు వెళ్ల‌గానే ప్ర‌మాద‌వ‌శాత్తు.. కారు న‌దిలోకి దూసుకెళ్లింది. కారు న‌దిలో మునిగిపోతుండ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు.. అక్క‌డికి వెళ్లారు. 8 నుంచి 10 మంది న‌దిలోకి దిగి.. మునిగిపోతున్న కారును.. ఒడ్డుకు చేర్చారు. కారు అద్దాలు ప‌గుల‌గొట్టి.. దాంట్లో ఉన్న నూత‌న వ‌ధూవ‌రుల‌తో పాటు మ‌రో ముగ్గురిని ప్రాణాల‌తో కాపాడారు.    


logo