బెంగళూరు: రోజురోజుకు పెరుగుతున్న వాయుకాలుష్యం క్యాన్సర్కు కారణమవుతున్నదని పరిశోధనలు చెబుతున్నాయి. గత కొన్నేండ్లుగా ఈ ప్రభావం పెరుగుతున్నదని బెంగళూరుకు చెందిన వైద్య నిపుణులు సందీప్ నాయక్ పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో 10 శాతానికి పైగా వాయు కాలుష్యం, ఇతరుల సిగరెట్ పొగ పీల్చడం, రాడాన్, అల్ట్రావయలెట్ రేడియేషన్, ఆస్బెస్టాస్, పలు ఇతర కెమికల్స్ బారిన పడటం వలన సంభవిస్తున్నాయని అన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు వాయు కాలుష్యం కారణమవుతున్నదని డబ్ల్యూహెచ్వో తెలిపింది.