Mahua Moitra | మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలి.. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సిఫార్సు?
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్‌సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్‌సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, నేరపూరితం, హేయమైనవి, నేరపూరితమైనవని అని పేర్కొంటూ కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీలతో కూడి తుది నివేదికను రూపొందించింది. అయితే అది విడుదలకు ముందే మీడియాకు లీక్ అవడం గమనార్హం.
మొయిత్రా అనైతిక వ్యవహారంపై భారత ప్రభుత్వం న్యాయ, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని అందులో పేర్కొంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలపై 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఈ నెల 2న కమిటీ ముందు హాజరయ్యారు.
నగదు, బహుమతులకు బదులుగా పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హిరానందాని మధ్య లంచం మార్పిడి జరిగిందని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించి న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ రాసిన లేఖను ఆయన ఉదహరించారు. అయితే వీటన్నింటినీ మహువా ఖండించారు. ఎంపీ నిషికాంత్ దూబే, జై అనంత్‌కు ఆమె ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

