న్యూఢిల్లీ, జూన్ 6: కెనడాలోని కననాస్కీస్లో జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీకి ఎట్టకేలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాని మోదీకి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫోన్ చేసి ఆహ్వానించారు.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన కార్నీకి శుభాకాంక్షలు తెలియచేశానని, ఈ నెలాఖరులో జరిగే జీ7 సదస్సుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియచేశానని మోదీ తెలిపారు.