న్యూఢిల్లీ : ఓ వ్యక్తికి రెండుసార్లు జీవిత ఖైదు శిక్షలు పడినపుడు, వాటిలో ఒకటి పూర్తయిన తర్వాత మరొకదానిని అమలు చేయవచ్చునా? అనే ప్రశ్నపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. 2010లో జరిగిన జంట హత్యల కేసులో దోషికి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రెండు జీవిత ఖైదులను విధిస్తూ 2015లో తీర్పు చెప్పింది.
తుది శ్వాస వరకు జైలులో ఖైదీగా ఉండాలని చెప్పేదే జీవిత ఖైదు అని, రెండు జీవిత ఖైదు శిక్షలను విధించడం నిష్ప్రయోజనకరమని తెలిపింది. శిక్ష తగ్గింపు, క్షమాభిక్ష వల్ల ఆ జీవిత ఖైదు శిక్షా కాలం తగ్గిపోతుందని గుర్తు చేసింది. అటువంటి పరిస్థితుల్లో శిక్ష అమలు ప్రారంభమవుతుందని పేర్కొంది. పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో గురువారం వాదనలు వినిపించారు.