Chandrayaan-4 | ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భేటీ అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. రైతులకు మేలు చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓ పథకం తర్వాత మరో పథకాలకు ఆమోదం తెలిపింది. ఎన్పీకే ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం, రష్యా-ఉక్రెయిన్‌లో నెలకొన్న ఘర్షణతో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల బారినపడకుండా ఉండేందుకు సబ్సిడీని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది.
పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశా కోసం రూ.35వేలకోట్లను కేబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటు చంద్రమయాన్ మిషన్‌కు సైతం కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వీనస్ మిషన్, గగన్‌యాన్, తర్వాతి తరం లాంచ్ వెహికిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సైతం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రయాన్-4 మిషన్ రూ.2,104 కోట్లతో ఆమోదం తెలిపింది. మిషన్‌లో చంద్రుడిపైకి చేరుకొని.. నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకోనున్నది. ప్రధాన మంత్రి జంజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద గిరిజన సంక్షేమానికి రూ.79,156 కోట్ల పథకం ఆమోదం పేర్కొంది.