న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ బుధవారం బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం రూ. 37,500 కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలియజేశారు. ప్రపంచంలోనే బొగ్గు నిల్వలు అధికంగా కలిగిన దేశాలలో భారత్ ఒకటని, మనకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, బొగ్గు నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేయడంపై భారత్ దృష్టి సారించిందన్నారు.
మొత్తం 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని, ఈ ప్రాజెక్టు కారణంగా 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతమున్న అంతర్జాతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు.