Union Cabinet | ప్రధాని నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ..! 14 పంటలకు ఎంఎస్పీ..!
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరి, రాగులు, మినుము, జొన్న, మక్కజొన్న, పత్తి సహా 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP) కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం మంత్రివర్గంలో కీలకమైన నిర్ణయం తీసుకుందన్నారు. ఖరీఫ్ పంటకు 14 పంటలకు ఎంఎస్పికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వరి కొత్త ఎంఎస్పీని రూ.2,300 నిర్ణయించినట్లు తెలిపారు. ఇది గత ఎంఎస్పీ కంటే రూ.117 ఎక్కువ. ఖరీఫ్ పంటల కొత్త ఎమ్మెస్పీపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘ఈ నిర్ణయంతో రైతులకు దాదాపు రూ.2లక్షల కోట్లు అందుతాయన్నారు.
#WATCH | On Union Cabinet decision on MSP for Kharif season crops, Information & Broadcasting Minister Ashwini Vaishnaw says, “With today’s decision, the farmers will get around Rs 2 lakh crores as MSP. This is Rs 35,000 crores more than the previous season.” pic.twitter.com/cUjJIqpzJ1
— ANI (@ANI) June 19, 2024
ఇది గత సీజన్ కంటే రూ.35వేల కోట్లు ఎక్కువ’ చెప్పారు. ఇదిలా ఉండగా.. కేంద్రం 2లక్షల గోడౌన్ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నది. ఈ ప్రాజెక్టుతో పాటు మహాపాల్ఘర్-బధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో రూ.76వేల కోట్లతో వధవన్ పోర్ట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ చేసింది. రూ.76,200 కోట్లతో నిర్మించనున్న ఈ ఓడరేవు పూర్తయితే ప్రపంచంలోని టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుంది. మొత్తం రూ.7,453 కోట్లతో గుజరాత్, తమిళనాడులో గిగావాట్ ఆఫ్షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త టెర్మినల్, రన్వే పొడిగింపుతో సహా వారణాసి విమానాశ్రయం అభివృద్ధికి రూ.2,869.65 కోట్ల ప్రతిపాదనకు, కాశీ విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ భవనం, కొత్త రన్వే, అండర్పాస్ హైవే నిర్మాణానికి సైతం కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

