న్యూఢిల్లీ: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్‌ను నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) తెలిపారు. మూడవ లాంచ్‌ప్యాడ్ ద్వారా నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికిల్స్(ఎన్జీఎల్వీ)ను ప్రయోగించనున్నారు. ఎన్జీఎల్వీ రాకెట్లు భారీ శాటిలైట్లను కక్ష్యలోకి మోసుకెళ్లగలవని ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నాలుగేళ్లలో లాంచ్‌ప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సుమారు 3985 కోట్ల ఖర్చుతో ఆ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. రోదసి ప్రయోగాలకు చెందిన మౌళిక సదుపాయాల కల్పనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా మారనున్నట్లు ఆయన చెప్పారు. మొదటి, రెండవ లాంచ్‌ప్యాడ్లతో పోలిస్తే .. మూడవ లాంచ్‌ప్యాడ అధిక సామర్థ్యంతో ఉండనున్నట్లు చెప్పారు.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, “…With a cost of Rs 3985 Crores, third launch pad has been sanctioned by the cabinet today. This will prove to be an important milestone for the country in space infrastructure. If you look at the first and second launch… pic.twitter.com/Mr5Cnw4D1j
— ANI (@ANI) January 16, 2025