న్యూఢిల్లీ, జనవరి 22: జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో ఐదేండ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ పదేండ్లు పూర్తి చేసుకుందని, 2021-22 మధ్యకాలంలో 12 లక్షల మంది వైద్య సంరక్షణ కార్మికులు ఇందులో చేరారని ఆయన తెలిపారు. ఈ మిషన్ మరో ఐదేండ్లు కొనసాగనున్నట్టు చెప్పారు. జనపనారకు మద్దతు ధరను ఆరు శాతం పెంచాలని సైతం నిర్ణయించినట్టు తెలిపారు. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గానూ జనపనార మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.315 పెంచి, రూ.5,650 ఇవ్వనున్నట్టు ప్రకటించారు.