Delhi Metro | రూ.8400కోట్లతో ఢిల్లీలో మెట్రో విస్తరణ.. కేంద్ర కేబినెట్ ఆమోదం..
Delhi Metro | దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు రూ.8400కోట్లు ఖర్చవనున్నది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు.
Delhi Metro | దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు రూ.8400కోట్లు ఖర్చవనున్నది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. తొలి కారిడార్ లజ్‌పత్‌నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ మధ్య.. 8.4 కిలోమీటర్లు ఉంటుందన్నారు. రెండో కారిడార్ ఇంద్రలోక్ నుంచి ఇంద్రప్రస్థ మధ్య 12.4 కిలోమీటర్లు ఉంటుందన్నారు.
రెండు కారిడార్లలో 2029 మార్చి నాటికి పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. లజ్‌పత్ నగర్-సాకేత్ మధ్య నిర్మించనున్న మెట్రో బ్లాక్ సిల్వర్, మెజెంటా, పింక్, వైలెట్ లైన్లను కలుపుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మార్గంలో ఎనిమిది స్టేషన్లు ఉంటాయన్నారు. ఇంద్రలోక్-ఇంద్రప్రస్థ మధ్య నిర్మించనున్న 12.377 కిలోమీటర్ల కారిడార్ గ్రీన్‌లైన్ పొడిగించనున్నట్లు అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఇక్కడి ఎరుపు, పసుపు, ఎయిర్పోర్ట్ లైన్, మెజెంటా, వైలెట్, బ్లూ లైన్లోకి మారే అవకాశం ఉంటుందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

