న్యూఢిల్లీ: ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్.. బస్సు సేవలను ప్రారంభించనుంది. దేశ రాజధాని ఢిల్లీలో తొలుత ఈ సేవలను తీసుకురానుంది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద బస్సులను నడుపనున్నది. ఈ మేరకు లైసెన్స్‌ను పొందినట్టు సోమవారం ఉబర్ తెలిపింది. ఈ తరహా లైసెన్స్ జారీచేసిన తొలి రాష్ట్రం ఢిల్లీనే. కస్టమర్లు వారం ముందే బస్సు సర్వీసులను బుక్ చేసుకోవచ్చని ఉబర్ తెలిపింది. ఒక్కో సర్వీసులో 15-50 మంది ప్రయాణించవచ్చని వెల్లడించింది.