సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 17:44:46

పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్య‌స‌భ‌ స్థానానికి డిసెంబ‌ర్ 14న ఉపఎన్నిక‌

పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్య‌స‌భ‌ స్థానానికి డిసెంబ‌ర్ 14న ఉపఎన్నిక‌

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానానికి డిసెంబ‌ర్ 14న ఉపఎన్నిక నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించింది. అదేరోజు ఫ‌లితాల‌ను కూడా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఈసీఐ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూనే పోలింగ్ నిర్వ‌హించే బాధ్య‌త‌ను రాష్ట్రంలోని ఒక‌ సీనియ‌ర్ అధికారికి అప్ప‌గించాల‌ని బీహార్ చీఫ్ సెక్రెట‌రీకి సూచించింది. ఈ స్థానం నుంచి ఎన్నిక‌య్యేవారు 2024 ఏప్రిల్ 2వ తేదీ వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగ‌నున్నారు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.