న్యూఢిల్లీ: అమెజాన్ సంస్థ(Amazon) మరోసారి ఉద్యోగులను తొలగించనున్నది. వచ్చే వారం రెండో దఫా ఉద్యోగాల కోత మొదలుకానున్నది. సుమారు 14 వేల మంది ఉద్యోగులు త్వరలో తమ ఉద్యోగాన్ని కోల్పోనున్నారు. కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 30 వేల మందిని తొలగించాలని ఆ సంస్థ నిర్ణయించిన విషయం తెలిసిందే. గత అక్టోబర్‌లో 14వేల వైట్ కాలర్ జాబ్స్‌ను తొలగించింది. అయితే ఈసారి కూడా గత ఏడాది తరహాలోనే ఉద్యోగుల సంఖ్య ఉంటుందని భావిస్తున్నారు. అయితే అమెజాన్ సంస్థ ప్రణాళికలు వెల్లడించేందుకు దాని ప్రతినిధిలు ఆసక్తి చూపలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటేల్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రీసోర్స్ లాంటి కేటగిరీల్లో కోత ఉండనున్నది.