థానే: మహారాష్ట్రలోని థానే (Thane) జిల్లాలో ఓ బస్టాప్‌నకు (Bus stop) బంగ్లాదేశ్‌గా పేరు పెట్టారు. ఉత్తన్ చౌక్‌లోని (Uttan Chowk) పశ్చిమ భయందర్ ప్రాంతంలో ఆ బస్టాప్ ఉన్నది. దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్‌కు (West Bengal) చెందిన శరణార్థులు ఉత్తన్ చౌక్‌లోని ఇందిరానగర్ ప్రాంతానికి వలస వచ్చారు. వారంతా చిన్నా చితక ఉద్యోగలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారంతా బెంగాలీలు (Bengalis) కావడంతో దానిని అంతా బంగ్లాదేశ్ (Bangladesh) అని పిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరా భయందర్ నగరపాలక సంస్థ అక్కడ ఉన్న బస్ స్టాప్నకు బంగ్లాదేశ్ అని నామకరణం చేసింది.
అయితే పేరు మార్చడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతం అస్థిత్వం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.