శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని (Jammu kashmir) జాజ్జర్ కోట్లీలో (Jhajjar Kotli) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం అమృత్సర్ (Amritsar) నుంచి కత్రా (Katra) వెళ్తున్న బస్సు.. జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిపై (Jammu-Srinagar national highway) జాజ్జర్ సమీపంలో బ్రిడ్జిపై నుంచి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో పది మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
రాజస్థాన్‌లోని (Rajasthan) ఝున్‌ఝునులో (Jhunjhunu) సోమవారం సాయంత్రం ఓ ట్రాక్టర్ (Tractor trolley) అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది అక్కడికక్కడే మరణించారు. మరో 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మాన్సా మాతా ఆలయంలో పూజాధికాలు పూజించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.