Watch: బస్సు కండక్టర్‌ను దారుణంగా కొట్టిన కొందరు.. వీడియో వైరల్
Bus conductor thrashed | కొందరు వ్యక్తులు బస్సు కండక్టర్‌ను దారుణంగా కొట్టారు. అతడి వద్ద ఉన్న క్యాష్ బ్యాగ్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళా ప్రయాణికులు జోక్యం చేసుకుని ఆ కండక్టర్‌ను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చెన్నై: కొందరు వ్యక్తులు బస్సు కండక్టర్‌ను దారుణంగా కొట్టారు. (Bus conductor thrashed) అతడి వద్ద ఉన్న క్యాష్ బ్యాగ్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళా ప్రయాణికులు జోక్యం చేసుకుని ఆ కండక్టర్‌ను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ బస్సు చతిరం నుంచి తువ్వకుడికి బయలుదేరింది. అయితే వరగనేరి చులైకరైలో మరియమ్మన్ ఆలయం వద్ద ఉన్న బస్టాప్‌లో ఒక మహిళ దిగలేదు. దీంతో బస్సును ఆపాలని కండక్టర్‌ను ఆమె అడిగింది. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరుగడంతో కొంత దూరంలో ఆ మహిళ బస్సు దిగింది.
కాగా, ఆ బస్సు చతిరం బస్టాండ్‌కు తిరిగి రాగా ఐదుగురు యువకులు అందులోకి ఎక్కారు. తమకు చెందిన మహిళను కండక్టర్ మూకయ్యన్ దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి తర్వాత మరొకరు ఆ కండక్టర్‌ను కొట్టడంతోపాటు పిడిగుద్దులు కురిపించారు. కండక్టర్ వద్ద ఉన్న క్యాష్ బ్యాగు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు.
మరోవైపు బస్సులోని కొందరు మహిళా ప్రయాణికులు జోక్యం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల దాడి నుంచి ఆ కండక్టర్‌ను కాపాడారు. అనంతరం ఆ కండక్టర్ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన కండక్టర్‌పై దాడి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#JUSTIN திருச்சியில் தனியார் பேருந்துக்குள் புகுந்து நடத்துநர் மீது தாக்குதல்#Trichy #conductor #news18tamilnadu | https://t.co/7dpn9FD15R pic.twitter.com/LHQ1ZV0XFv
— News18 Tamil Nadu (@News18TamilNadu) February 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

