భోపాల్: బురఖా ధరించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించారు. అయితే బ్యాంకు సిబ్బంది ధైర్యంగా వ్యవహరించి ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇండోర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ముస్లిం మహిళల మాదిరిగా బురఖాలు ధరించారు. శుక్రవారం బైక్‌పై ప్రయాణించిన వారిద్దరూ భికాన్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు చేరుకున్నారు. అనంతరం లోనికి ప్రవేశించి తమ వద్ద ఉన్న గన్స్ బయటకు తీశారు. వాటిని చూపించి బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. ఒక దొంగ క్యాబిన్లో ఉన్న బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లాడు. ఒకరి చేతులు కట్టేశాడు.
కాగా, అప్రమత్తమైన మరో బ్యాంకు సిబ్బంది అలారమ్ మోగించాడు. దీంతో ఒక దొంగ భయంతో బయటకు పరుగులు తీశాడు. మరో దొంగ కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాంకు సిబ్బందిలో ఒకరు ధైర్యం చేసి అతడ్ని పట్టుకున్నాడు. ఇంతలో పోలీసులు అక్కడకు రాగా పట్టుకున్న దొంగను వారికి అప్పగించారు. పారిపోయిన మరో దొంగను కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు బ్యాంకులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
CAUGHT ON CAMERA – Wearing a burqa and carrying guns, criminals tried to loot a bank in Bhikan village of Khargone district. Due to the vigilance of the bank employees, one of the the criminals was caught, while the other managed to escape. pic.twitter.com/Ln5EmnTxoY
— TIMES NOW (@TimesNow) February 10, 2023