న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన సూత్రధారుడు, యాప్ సృష్టికర్త 21 ఏండ్ల నీరజ్ బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని జోర్హాట్లో గురువారం తెల్లవారుజామున అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకొన్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నీరజ్ చదువుకుంటున్నాడు. ముస్లిం మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ వందలాది మంది ఫొటోలను బుల్లిబాయ్ యాప్‌లో ఉంచడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే.