Bulli Bai App | నీరజ్ బిష్ణోయ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు ఇది. బుల్లి బాయ్ అనే యాప్ క్రియేట్ చేసి ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన కేటుగాడు ఇతడు. ఇతడే ఆ యాప్‌కు కర్త కర్మ క్రియ. దాన్ని క్రియేట్ చేసి.. మహిళల హక్కులకు భంగం కలిగించినా.. ఇంత తప్పు చేసినా.. అతడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదని.. పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. అరెస్ట్ చేసినా.. కోర్టులో హాజరుపరిచినా.. తన ప్రవర్తన ఏం మారలేదని.. తానేమీ తప్పు చేయలేదు.. అనే విధంగా నీరజ్ ప్రవర్తన ఉన్నట్టు తెలుస్తోంది. తనలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులకు అనిపించిందట.
నేను ఏ తప్పు చేయలేదు. నేను ఆ యాప్ క్రియేట్ చేయడం తప్పు కాదు.. అంటూ నీరజ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టు తెలుస్తోంది. భోపాల్‌లోని ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న బిష్ణోయ్.. బుల్లి బాయ్ యాప్ క్రియేట్ చేసి కొత్త సంవత్సరం రోజునే ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. అసలు సూత్రధారి నీరజ్ అని తెలియక.. పోలీసులు ముందు వేరే వాళ్లను అరెస్ట్ చేశారు. చివరకు ట్విట్టర్ అకౌంట్ ద్వారా నీరజ్‌ను కనిపెట్టి.. అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఉంటున్న నీరజ్‌ను అరెస్ట్ చేశారు. అస్సాం పోలీసుల సాయంతో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. వెంటనే కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు 7 రోజుల పాటు అతడిని విచారించేందుకు పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది.