లక్నో: ప్రతి శుక్రవారం జరిగే హింస తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామంటూ బీజేపీ నేత వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్లో బుల్డోజర్ సంస్కృతిని ఆయన గుర్తు చేశారు. పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్ప వ్యాఖ్యలు చేయడంపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని పలు చోట్ల, ప్రధానంగా ప్రయోగ్రాజ్లో ఆందోళకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. పలు చోట్ల రాళ్లు రువ్వడంతోపాటు పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రయాగ్రాజ్, సహరాన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్, లక్నో జిల్లాల్లో శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి 130 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
మరోవైపు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారుడు, బీజేపీ నేత మృత్యుంజయ్ కుమార్ శనివారం ఒక ట్వీట్ చేశారు. ‘గుర్తుంచుకోండి, ప్రతి శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది’ అని పేర్కొన్నారు. బుల్డోజర్లతో కూల్చివేస్తున్న ఫొటోను ఆయన అందులో ఉంచారు. ఆందోళనకారులపై బుల్డోజర్లతో చర్యలు తీసుకుంటామని పరోక్షంగా ఆయన హెచ్చరించారు.
కాగా, హర్యానా బీజేపీ ఐటీ ఇంచార్జీ అరుణ్ యాదవ్ కూడా శుక్రవారం ఇలాంటి పోస్ట్ చేశారు. ‘ఇప్పుడు శుక్రవారం స్టోన్ డే, శనివారం బుల్డోజర్ డేగా ప్రకటించాలి’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
उपद्रवी याद रखें, हर शुक्रवार के बाद एक शनिवार ज़रूर आता है… pic.twitter.com/I8Y1SrPolL
— Mrityunjay Kumar (@MrityunjayUP) June 11, 2022
Now Friday being Stone-Day
Saturday should be declared as " Bulldozer Day "— Arun Yadav (@beingarun28) June 10, 2022