జైపూర్: తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన ముస్లిం స్టూడెంట్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. (Bulldozer action) ఈ సందర్భంగా అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శుక్రవారం లంచ్ బ్రేక్ సమయంలో కొట్టుకున్నారు. ఈ సందర్భంగా హిందూ దళిత విద్యార్థిని ముస్లిం స్టూడెంట్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో మత కలహాలకు దారి తీసింది. రెండు వర్గాలకు చెందిన వారు అల్లర్లకు పాల్పడ్డారు. పలు కార్లకు నిప్పుపెట్టారు.
కాగా, నిందితుడైన ముస్లిం విద్యార్థి, అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వారు నివసిస్తున్న అద్దె ఇల్లు అక్రమ నిర్మాణంగా ఉదయ్‌పూర్ జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో శనివారం వారిని ఖాళీ చేయించిన తర్వాత జేసీబీలతో ఆ ఇంటిని కూల్చివేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన స్థానికులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
Rajasthan: Bulldozer action started at the residence of the Muslim boy, who stabbed multiple time at a Dalit Hindu boy in Udaipur.
Good job by CM @BhajanlalBjp ji 🙏🙏🙏 pic.twitter.com/Ct6CnZxG0i
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) August 17, 2024