బెంగళూరు: పాడుబడిన భవనం కూలిపోయింది. (Building Collapses) ఈ సంఘటనలో ఒకరు మరణించగా కొందరు గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం బేలూరు బస్టాండ్ వద్ద ఉన్న పాడుబడిన బిల్డింగ్ కూలిపోయింది. ఆ సమయంలో భవనం ముందు కొందరు కూర్చొన్నారు. ఈ సంఘటనలో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. మృతుడ్ని అమర్నాథ్గా గుర్తించారు. బిల్డింగ్ కూలడం చూసి స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, పురాతన బిల్డింగ్ కూలిన సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన నలుగురిని హసన్‌లోని హిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి తెలిపారు. బిల్డింగ్ కూలిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
📍Karnataka | #Watch: One person died and four were injured when an abandoned building collapsed in Karnataka’s Hassan.
Two of the four injured are in critical condition after the collapse that occurred in front of the Belur bus stand.
Read more: https://t.co/OiZxptexF6 pic.twitter.com/Q3s20ejX5X
— NDTV (@ndtv) March 9, 2025