చండీగఢ్: బహుళ అంతస్తుల భవనం తెల్లవారుజామున కూలిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంత మంది మరణించారన్నది ఇంకా తెలియలేదు. (Building Collapses) తెల్లతెల్లవారుజామున బిల్డింగ్ కుప్పకూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున 7 గంటల సమయంలో ప్రధాన మార్కెట్ ప్రాంతమైన సెక్టార్ 17లోని బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాకయ్యారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. కూలిన బిల్డింగ్ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రాణ నష్టం జరిగిందా? అన్నది ఇంకా తెలియలేదు. అయితే బహుళ అంతస్తుల బిల్డింగ్ కూలడాన్ని రోడ్డుపై వెళ్లే ఒక వ్యక్తి మొబైల్లో రికార్డ్ చేశాడు. షాక్‌కు గురి చేసేలా ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Chandigarh: A building in Sector 17’s main market collapsed around 7 AM. A video recorded by bystanders before the incident has surfaced. Police were informed shortly after at 7:15 AM pic.twitter.com/QHgLn4Tj27
— IANS (@ians_india) January 6, 2025
VIDEO | A multi-storey building collapses in Chandigarh’s Sector-17. Relief and rescue operations underway. More details are awaited.#ChandigarhNews
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/7ZEG2JGLl7
— Press Trust of India (@PTI_News) January 6, 2025