బాంద్రా: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా (తూర్పు) ఏరియాలోగల బెహ్రామ్ నగర్లో ఇవాళ ఓ భవనం కూలిపోయింది. ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. కూలిన భవనం కింద ఐదు మంది చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, భవనం కూలిన వెంటనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం ఫైరిజంన్ల సాయంతో ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా అత్యసవర వైద్యసేవల కోసం అధికారులు ఘటనా ప్రాంతానికి 6 అంబులెన్స్‌లను రప్పించారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.
#WATCH | Visuals from the site of 5-storey building collapse in Behram Nagar locality of Bandra (East), Mumbai.
— ANI (@ANI) January 26, 2022
Five people are feared trapped in the building, as per BMC pic.twitter.com/J5MXuAmIdn