న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగి శాయి. ఉభయ సభ లు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అదానీ వ్యవ హారంపై జేపీసీ వేయాలన్న ప్రతిపక్షాల ఆందోళన, బ్రిటన్లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్పాల ని అధికార పక్షం డిమాండ్ల మధ్య బడ్జెట్ సమావేశాలు తుడిచి పెట్టుకుపో యాయి. ఎలాంటి చర్చ లేకుండానే 6 బిల్లులకు ఆమోదం తెలిపింది.
షెడ్యూల్ టైమ్లో లోక్సభలో 34 శాతం, రాజ్య సభలో 24 శాతం మాత్రమే కార్యకలా పాలు సాగాయి. బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరిగాయి. మేధోసంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ వివరాల ప్రకారం.. లోక్సభ మొత్తం 133.6 గంటలు పని చేయాల్సి ఉండగా, 45 గంటలు మాత్రమే పని చేసింది. రాజ్యసభ 130 గంటలకు 31 గంటలే పని చేసింది.