Budget 2026 | ఎన్నికల సంఘానికి బూస్ట్.. కేంద్ర బడ్జెట్లో నిధుల శాతం పెంపు
Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026లో ఎన్నికల సంఘానికి ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్లో 25.33 శాతం నిధులు పెంచారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సంఘానికి రూ.304.98 కోట్లు కేటాయించగా.. 2026-27 బడ్జెట్లో రూ.382.22 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026లో ఎన్నికల సంఘానికి ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్లో 25.33 శాతం నిధులు పెంచారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సంఘానికి రూ.304.98 కోట్లు కేటాయించగా.. 2026-27 బడ్జెట్లో రూ.382.22 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ, సంబంధిత ఖర్చుల కోసం ఇందులో రూ.367.69 కోట్లు నిధులు వెచ్చిస్తారు.
మిగిలిన నిధుల్ని పరిపాలనా ఖర్చులకు వాడుతారు. ఈ ఏడాది తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిధుల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు న్యాయ శాఖకు రూ.250 కోట్లు కేటాయించారు. అలాగే దేశంలో రసాయనాల ఉత్పత్తి పెంచేందుకు కూడా ఈ సారి బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. కెమికల్ పార్కుల అభివృద్ధి కోసం రూ.600 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కొన్ని రసాయనాల్ని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కెమికల్ పార్కులతో వాటిని ఇక్కడే తయారు చేసే వీలుంటుంది. వీటి తయారీ కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం రూ.20,000 కోట్లు అవసరం అని అంచనా.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సామాన్యులు కూడా ఆదాయపు పన్నుదాఖలు చేసేలా చట్టంలో మార్పులు తెస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్‌పై టీడీఎస్ ను 2 నుంచి 5 శాతానికి తగ్గించారు. విదేశీ యాత్రలు ఇకపై సులభతరం కానున్నాయి. వీటిపై పన్నుల్ని తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.2 వేల కోట్లు కేటాయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

