Census | న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే ఈ ఏడాది కూడా జనగణన చేపట్టే అవకాశం లేదు. దీనికోసం 2025 సంవత్సరానికి బడ్జెట్లో కేవలం 574.80 కోట్లను మాత్రమే కేటాయించారు.
దేశంలో జనాభా లెక్కల కోసం 8,754.23 కోట్లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) కోసం 3,941.5 కోట్లు కేటాయించాలని 2021లో నిర్ణయించారు. 2020 ఏప్రిల్లో నుంచి ప్రారంభించాలని నిర్ణయించినా కొవిడ్ వల్ల అది కార్యరూపం దాల్చలేదు.