ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు ఆయుష్మాన్
ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.5 లక్షల కవరేజీతో ఆయుష్మాన్ భారత్‌ను వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ‘సాక్షమ్ అంగన్వాడీ’ పథకం కింద ఆంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని..గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ‘పోషణ్ 2.0’ కార్యక్రమాన్ని అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు.
- గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన కోసం బాలికలకు టీకా
- వ్యాక్సిన్ల సమాచారం కోసం యూ-విన్ ప్లాట్‌ఫామ్
- గర్భిణుల్లో పోషకాహారం కోసం ‘పోషణ్ 2.0’
- ఆరోగ్య రంగానికి బడ్జెట్లో రూ.90 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.5 లక్షల కవరేజీతో ఆయుష్మాన్ భారత్‌ను వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ‘సాక్షమ్ అంగన్వాడీ’ పథకం కింద ఆంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని..గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ‘పోషణ్ 2.0’ కార్యక్రమాన్ని అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా 9-14 ఏండ్ల బాలికలకు క్యాన్సర్ నిరోధక టీకాపై దృష్టి సారిస్తామన్నారు. మరోవైపు పిల్లల్లో రోగ నిరోధకత పెంచటానికి ‘మిషన్ ఇంద్రధనస్సు’ను నిర్వహించేందుకు ‘యు-విన్’ ప్లాట్‌ఫామ్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
మరిన్ని మెడికల్ కాలేజీలు
‘ప్రజలకు సేవ చేయాలని ఎంతో మంది యువత వైద్య వృత్తి వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకొని మరిన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తాం’ అని నిర్మల తెలిపారు. ఇందుకోసం ఓ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఆరోగ్య రంగానికి ఈ సారి బడ్జెట్లో రూ.90,658.63 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇవి 12.59 శాతం ఎక్కువ. ఇందులో రూ.87,656.90 కోట్లు ఆరోగ్యం-కుటుంబ సంక్షేమానికి కేటాయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

