పార్టీ టికెట్ రాకపోవడంతో బోరున ఏడ్చిన బీఎస్పీ నేత.. పోలీసులకు ఫిర్యాదు

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ టికెట్ రానందుకు ఒక పార్టీ నేత బోరున ఏడ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన, ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు అర్షద్ రాణా, ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుండి టికెట్ ఆశించారు. చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దధేడు గ్రామానికి చెందిన ఆయన చాలా కాలంగా బీఎస్పీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య కూడా జిల్లా పంచాయతీ మెంబర్ పదవికి బీఎస్పీ తరపున పోటీ చేశారు.
దీంతో పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న అర్షద్ రాణా, చాలా కాలంగా బీఎస్పీ తరుఫున చార్తావాల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చార్తావాల్ అసెంబ్లీ స్థానం నుండి సల్మాన్ సయీద్‌ను పార్టీ పోటీకి దింపినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత అయిన సల్మాన్ సయీద్, హోం శాఖ మాజీ రాష్ట్ర మంత్రి సయీదుజ్జమాన్ కుమారుడు. కాగా, ఈ ప్రకటనతో హర్ట్ అయిన రాణా ఇటీవల ఫేస్బుక్లో తన కష్టాల గురించి రాసుకున్నారు.
అనంతరం అర్షద్ రాణా, తన మద్దతుదారులతో కలిసి కొత్వాలి నగరానికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన, పోలీసుల ముందు ఏడుస్తూ కనిపించారు. రెండేళ్ల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు టికెట్ కోసం రూ. 67 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. తనకు తెలియకుండానే తనకు టికెట్‌ను నిరాకరించారని విమర్శించారు. టికెట్ కేటాయించనందున తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పార్టీ నేతలను డిమాండ్ చేశారు. ఒక బీఎస్పీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాణా బెదిరించారు.
మరోవైపు రాణా ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని, అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్వాలి నగర ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు. కాగా, పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు అర్షద్ రాణా బోరున ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#मुजफ्फरनगर
— Zuber Akhtar (@Zuber_Akhtar1) January 14, 2022
विधानसभा का टिकट न मिलने के कारण थाने में फूट फूट कर रोते ये है बसपा नेता अरशद राणा।
इनका आरोप है कि बसपा नेता शमशुद्दीन राइन ने इनसे टिकट के नाम पर 67 लाख रुपए ले लिए।
पीड़ित नेता जी अब आत्मदाह करने की घोषणा कर रहे है।#UPElection2022 @bspindia #ViralVideos pic.twitter.com/mhz2mXymjw
#WATCH | I've been working for 24 years; was formally declared candidate from Charthawal in 2018 (for 2022 UP polls), have been trying to get in touch with party, no proper response; have been told to arrange Rs 50 lakhs…had already paid about Rs 4.5 lakh: BSP's Arshad Rana pic.twitter.com/iIRCOPQ9is
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

