లక్నో, మార్చి 2: తాను బతికున్నంత వరకు తన వారసుడిని ప్రకటించనని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. పార్టీ అన్నింటి కంటే అత్యున్నతమైనదని, ఆ తర్వాతే ఏ సంబంధాలైనా వస్తాయని ఆమె తెలిపారు. తన సోదరులు ఆనంద్ కుమార్, రామ్‌జీ గౌతంలను పార్టీ జాతీయ సమన్వయకర్తలుగా ఆమె నియమించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు, పార్టీలో ముఠా కక్షలకు పాల్పడినందుకు తన మామ అశోక్ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అతడు ఆకాశ్ ఆనంద్ రాజకీయ కెరీర్‌ను నాశనం చేశాడని ఆమె తెలిపారు.