చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అల్వార్‌పేటలోని నరసింహన్ నివాసానికి కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తదితరులు వెళ్లగా నరసింహన్-విమల దంపతులు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు నరసింహన్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సన్మానించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిమను, పండ్లను బహూకరించారు. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందానికి నరసింహన్ తేనీటి విందు ఇచ్చి కొద్దిసేపు వారితో ఇష్టాగోష్టి జరిపారు.