BRS | ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్
బీఆర్ఎస్ (BRS) సభ్యుల నిరసనలతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్ ఉభసభల్లో బీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ (BRS) సభ్యుల నిరసనలతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్ ఉభసభల్లో బీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత కే కేశవరావు ఆధ్వర్యంలో ఎంపీలు ఆందోళనకు దిగారు. ఉభయసభల్లో రిజర్వేన్ల బిల్లులు ప్రవేశపెట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దేశంలో జనగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళ, బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. కాగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరుగనున్న ఈ సవేశాల్లో కేంద్ర ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. తొలిరోజు 75 ఏండ్ల పార్లమెంటు ప్రస్థానంపై చర్చ జరుగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BC reservation
- BRS
- KK
- lok sabha
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

