ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి నరేంద్ర మోదీ అంటూ జూలై-ఆగస్టు 2019 సంచికలో ‘బ్రిటిష్ హెరాల్డ్’ వార్తా కథనం వెలువరించింది. ‘చాలా గొప్ప మ్యాగజైన్. భారత్ విశ్వగురు అయ్యింది’ అంటూ బీజేపీ నాయకులు ఆనాడు తెగ హడావిడి చేశారు.
అదే మ్యాగజైన్ ‘భారత్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి’ అంటూ ఈనెల కథనం వెలువరించింది. మైనార్టీ వర్గాలపై దాడులు పెరుగుతున్నా, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినా..ప్రధాని మౌనం వీడటం లేదని విమర్శించింది. దీనికి బీజేపీ శ్రేణులు ఏం సమాధానం చెబుతాయో?