న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించేందుకు.. రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టాన్ని తయారు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి ఇవాళ ప్రతిపక్ష నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో లడాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కలపాలని కోరుతూ చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత అయిదేళ్లుగా జమ్మూకశ్మీర్ ప్రజలు రాష్ట్ర హోదాను కోరారని రాహుల్, ఖర్గేలు తమ లేఖలో తెలిపారు. తమ డిమాండ్ చట్టపరమైందని, రాజ్యాంగ.. ప్రజాస్వామ్య హక్కుల పరిధిలో ఉందన్నారు.గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర హోదా ఇచ్చారని, విభజనచేపట్టి పూర్తి స్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారని ఖర్గే ఆరోపించారు. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని గతంలో పలుమార్లు చెప్పినట్లు మోదీ గురించి కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. గతంలో ఆర్టికల్ 370 గురించి కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
“We urge upon the Government to bring forward a legislation in the upcoming Monsoon Session of Parliament to grant full statehood to the Union Territory of Jammu and Kashmir.
Additionally, we request that the Government bring forward legislation to include the Union Territory of… pic.twitter.com/GQuthpxG79
— Congress (@INCIndia) July 16, 2025