కైసర్‌గంజ్: యూపీలో బీజేపీ సర్కారు అమలు చేస్తున్న బుల్డోజర్ పాలసీని సొంత పార్టీ ఎంపీ వ్యతిరేకించారు. బుల్డోజర్ కూల్చివేతలకు తాను వ్యతిరేకమని, ఒక ఇంటిని నిర్మించడం చాలా కష్టతరమని బీజేపీ ఎంపీ, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ పేర్కొన్నారు. గోండు జిల్లా కైసర్‌గంజ్‌లో తన స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు మద్దతుగా ఆయన ఆదివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుల్డోజర్ పాలసీకి తాను వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటిస్తున్నానన్నారు.