న్యూఢిల్లీ: ఇండోనేసియాకు (Indonesia) చెందిన టార్మాన్(74) అనే వృద్ధుడు సుమారు రూ.2 కోట్లు చెల్లించి అరికా(24) అనే యువతిని పెండ్లి చేసుకోవడం ఆన్లైన్లో చర్చనీయాంశమైంది. ఈ వివాహ వేడుకలో తమ బిల్లును చెల్లించలేదని ఫొటోగ్రఫీ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం… ఈ నెల 1న తూర్పు జావా ప్రావిన్స్‌లోని పాసిటన్ రీజెన్సీలో ఈ పెండ్లి జరిగింది. పెండ్లి వేడుక పూర్తయిన కొద్ది సేపటికే కొత్త దంపతులు తమ బిల్లు చెల్లించకుండా అదృశ్యయ్యారని ఫొటోగ్రఫీ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.