భావ్నగర్, నవంబర్ 16 : కొద్ది గంటల్లో పెండ్లి అనగా పెండ్లి కొడుకు చేతిలో 24 ఏండ్ల యువతి దారుణంగా హత్యకు గురైన ఘటన గుజరాత్లోని భావ్నగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సాజన్ బరియా, సోనీ రాథోడ్లు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం వారికి వివాహం జరగాల్సి ఉండగా, ఉదయం సోని ఇంటికి సాజన్ వచ్చాడు.
పెండ్లి చీర, ఖర్చుల గురించి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పట్టలేని సాజన్ ఆమె తలపై ఐరన్ పైపుతో కొట్టి, తర్వాత ఆమె తలను గోడకేసి బాదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నారు.