డెహ్రాడూన్ : ఆఖరి నిమిషంలో అక్కడక్కడా పెండ్లిండ్లు ఆగిపోవడం చూస్తుంటాం. అయితే ఉత్తరాఖండ్‌లోని హల్ధ్వానిలో ఓ వింత కారణంతో పెండ్లికి వధువు నో చెప్పింది. పెండ్లి కొడుకు తనకు నాసిరకం లెహంగా పంపడంతో ఆమె ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అల్మోరాకు చెందిన పెండ్లికొడుకు వధువు కోసం లక్నో నుంచి రూ 10,000 విలువైన లెహంగా ఆర్డర్ చేశాడు.
చీప్ లెహంగా ఆమెకు నచ్చకపోవడంతో ఏకంగా పెండ్లినే క్యాన్సిల్ చేసేసింది. ఇక ఈ వ్యవహారం హల్ద్వాని కొత్వాలి వద్దకు చేరడంతో పరస్పర అంగీకారం అనంతరం ఇరు పక్షాలు వెనుతిరిగాయి. అయితే వరుడి కుటుంబం వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింట్ చేయించింది.
చివరికి ఇరు పక్షాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి బాహాబాహీకి దిగగా నచ్చచెప్పిన పోలీసులు పెండ్లి రద్దు చేసి ఎలాగోలా వారిని ఇండ్లకు పంపించారు. జూన్‌లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగ్గా నవంబర్‌లో వివాహం చేసుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. మొత్తానికి లెహంగా నచ్చకపోవడంతో వధువు పెండ్లిని క్యాన్సిల్ చేయించడంతో అందరూ విస్తుపోయారు.