MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
MK Stalin | తమిళనాడు (Tamil Nadu) లో జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) ప్రభుత్వానికి వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు డ్రగ్స్ అక్రమ రవాణాచేస్తూ పట్టుపడి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాడు. ఇప్పుడు తేనిలోని జైలు (Theni Jail) నుంచి ఖైదీలు పారిపోవడంతో ప్రభుత్వంపై విమర్శలపాలవుతోంది.
MK Stalin : తమిళనాడు (Tamil Nadu) లో జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) ప్రభుత్వానికి వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు డ్రగ్స్ అక్రమ రవాణాచేస్తూ పట్టుపడి అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాడు. ఇప్పుడు తేనిలోని జైలు (Theni Jail) నుంచి ఖైదీలు పారిపోవడంతో ప్రభుత్వంపై విమర్శలపాలవుతోంది. వీటిపై మాజీ ముఖ్యమంత్రి (Ex CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్న ‘బ్రేకింగ్ బ్యాడ్ (Breaking Bad)’, ఇప్పుడు ‘ప్రిజన్ బ్రేక్ (Prison Break)’ అంటూ సోషల్ మీడియా (Social Media) లో పోస్టుపెట్టారు.
ప్రముఖ వెబ్ సిరీస్‌ల పేర్లతో రాష్ట్రంలోని శాంతి భద్రతలను పోల్చారు. తమిళనాడులో ‘బ్రేకింగ్ బ్యాడ్’ తర్వాత ‘ప్రిజన్ బ్రేక్’ మొదలైందని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం బెయిల్‌పై బయట ఉన్న నేరస్థులనే పర్యవేక్షించడం లేదనుకున్నానని, జైలులో ఉన్న ఖైదీలు తప్పించుకుంటున్నా చూస్తూ కూర్చుంటోందని ఇప్పుడు స్పష్టమైందని విమర్శించారు. ఇప్పటికే పుళల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన మరవకముందే ఇప్పుడు తేని జైలు నుంచి 17 మంది పారిపోయారన్నారు.
1995 తర్వాత ఒకేసారి ఇంతమంది ఖైదీలు పారిపోవడం ఇదే తొలిసారని స్టాలిన్ పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లు, మెరుగైన సాంకేతికత ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. బయట ఉన్న నేరగాళ్లు స్వేచ్ఛగా నేరాలు చేస్తున్నారని, లోపల ఉన్న ఖైదీలు ధైర్యంగా తప్పించుకుంటున్నారని విమర్శలు చేశారు. మొత్తం మీద ఎవరికీ ఉపయోగపడని ప్రభుత్వం మనదని, వారు ప్రజలను రక్షించరని ఎద్దేవా చేశారు. ప్రజలే తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితికి తమిళనాడు చేరిందని తీవ్ర విమర్శలు చేశారు.
రూ.100 కోట్ల విలువైన 135 కిలోల డ్రగ్స్ అక్రమ రవాణా చేసిన కేసులో ఇటీవల నాగపట్టణానికి చెందిన టీవీకే నేత ఒకరు అరెస్టయ్యారు. దానిపై స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. బ్రేకింగ్ బ్యాడ్ అనే వెబ్‌సిరీస్‌ను ప్రస్తావిస్తూ.. టీవీకే ‘బ్యాడ్ పార్టీ’ మాత్రమే కాదని, ‘బ్రేకింగ్ బ్యాడ్ పార్టీ’ అని వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన పోస్టులో దీనితోపాటు మరో వెబ్ సిరీస్ ‘ప్రిజన్ బ్రేక్’ పదాన్ని ప్రస్తావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

