న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: పార్లమెంట్లో 131వ రాజ్యాంగ (సవరణ) బిల్లు వీగిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళారం సభా హక్కుల నోటీస్ అందించారు. ఇది అధికారాన్ని దుర్వినియోగ పర్చడంగా ఆయన ఆరోపించారు.
ప్రధాని ప్రతిపక్షాన్ని విమర్శించిన ప్రసంగం తీవ్ర ఉల్లంఘన, సభా ధిక్కారం కిందికి వస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు మద్దతు తెలుపకపోవడంతోనే తమ బిల్లు వీగిపోయిందంటూ ప్రధాని చేసిన విమర్శలు అనైతికం, అధికార దుర్వినియోగమని ఆయన మండిపడ్డారు.