న్యూఢిల్లీ, మార్చి 20: ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. 66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే మెదడులో రక్తస్రావం అవుతుండటంతో ఈ నెల 17న ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేశామని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్టు ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.