న్యూఢిల్లీ: మీరు ఎక్కువగా మద్యపానం చేస్తుంటే కాలేయ వ్యాధులతో పాటు ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త అధ్యయనం ప్రకారం అతిగా మద్యం తాగని 75 ఏండ్ల వారితో పోలిస్తే అతిగా మద్యం తాగే 64 ఏండ్ల వారు బ్రెయిన్ స్ట్రోక్తో బాధ పడుతున్నట్టు తేలింది.
న్యూరాలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వారంలో మూడు కంటే ఎక్కువ మద్యం తాగేవారు ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అనే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.