న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్స్‌ను తయారు చేసే బ్రహ్మోస్ ఏరోస్పేస్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ అగ్నివీరులకు సాంకేతిక, పరిపాలన, భద్రతా విభాగాల్లో రిజర్వుషన్లు కల్పించాలని నిర్ణయించింది.
సాంకేతిక, సాధారణ పరిపాలన విభాగాల్లో కనీసం 15 శాతం; పరిపాలన, భద్రత విభాగాల్లో భర్తీ చేయవలసిన ఉద్యోగాల్లో 50 శాతం అగ్నివీరుల కోసం కేటాయిస్తున్నట్లు ఈ కంపెనీ తెలిపింది.