Ambedkar | షిగ్గాన్: అంబేద్కర్‌పై కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అజీమ్ పీర్ ఖాద్రీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ నెల 13న షిగ్గాన్ ఉప ఎన్నిక సందర్భంగా మంగళవారం మాదిగ వర్గం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఆ రోజుల్లో అంబేద్కర్ ఇస్లాంలో చేరడానికి అంతా సిద్ధమైంది. కానీ చివరికి ఆయన బౌద్ధుడయ్యారు. ఆయన ఇస్లాంలో చేరి ఉంటే ఇవాళ హోం మంత్రి పరమేశ్వర సహా చాలా మంది దళితులు ముస్లింలుగా ఉండేవారు’ అని ఖాద్రీ అన్నారు. ఖాద్రీ వ్యాఖ్యలు ఆయన, ఆయన పార్టీ అజ్ఞానాన్ని సూచిస్తున్నదని బీజేపీ విమర్శించింది.