Tamil Nadu | ర్యాష్ డ్రైవింగ్.. 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డ స్టూడెంట్
Tamil Nadu | ఓ యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో స్కూల్ విద్యార్థి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.
Tamil Nadu | చెన్నై : ఓ యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో స్కూల్ విద్యార్థి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.
కోయంబత్తూరులోని అభిరామి థియేటర్ వద్ద ఓ స్కూల్ స్టూడెంట్ రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఓ బస్సు వచ్చింది. అయితే బైక్‌ను గమనించని స్టూడెంట్.. బస్సు వచ్చే లోపు వేగంగా ముందుకు కదిలాడు. బస్సును ఓవర్ టేక్ చేస్తూ స్పీడ్‌గా వచ్చిన బైక్.. ఆ విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో స్టూడెంట్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు.
ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక బైక్ రైడర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిని నజీర్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజీర్‌ను అరెస్టు చేసి, బైక్‌ను సీజ్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

